ప్రాంతీయం

మహాత్ముల సేవలు మరవద్దు

38 Views

గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రాలతో ఘన నివాళి

మహాత్ముల సేవలు మరవద్దు: సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అక్టోబర్ 2

మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా చిత్రాలను అవాలతో అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యక్రమంలో బుధవారం నాడు ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆ మహనీయులు మన దేశానికి ఎంతో సేవ చేశారని వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. మాజీ ప్రధాని నేటి నాయకులకు ఆదర్శప్రాయుడు, నిరాడంబరుడు, నిష్కలంక దేశభక్తుడు, నిజాయితీకి నిలువుటద్దం, దార్శనికుడు లాల్ బహదూర్ శాస్త్రి అని కొనియాడారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్