గణేష్ చతుర్దశి సందర్భంగా ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల వద్ద కానీ నిమార్జనం రోజున కానీ అనుమతులు లేకుండా డిజె లు పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల డిఎస్పీ ఉదేయ్ రెడ్డి తెలిపారు.
ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారం డిజే యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సిరిసిల్ల డిఎస్పీ మాట్లాడుతూ.ఎటువంటి అనుమతి లేకుండా డిజె లు ఉపయోగిస్తే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.పోలీస్ వారి సూచనలు అతిక్రమించి ఎవరైనా డిజె లు పెడితే అట్టి డిజె లను సీజ్ చేసి కేసులు నమోదు చేయటం జరుగుతుంది అని వినాయక చవితి దృష్టిలో ఉంచుకొని అనుమతి లేకుండా డిజె పెట్టవద్దని హెచ్చరించారు.డిఎస్పీ వెంట రూరల్ సి.ఐ సదన్ కుమార్,ఎస్.ఐ శేఖర్ ఉన్నారు.
