Breaking News

వరల్డ్‌ రికార్డ్‌

215 Views

వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించబోతున్న ఖైరతాబాద్ గణపతి.

 

హైదరాబాద్:సెప్టెంబర్ 18

గణేష్‌ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఎటు చూసినా గణేష్‌ ఉత్సవ శోభే కనిపిస్తోంది ఖైరతాబాద్ గణపయ్య రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు.

ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు ఖైరతాబాద్ గణేశుడు 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించాడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణనాథుడు మరి కాసేపట్లో తొలి పూజలు అందుకోనున్నాడు.

చరిత్రలోనే తొలిసారి 63 అడుగుల ఎత్తైన మట్టి ప్రతిమను ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు ఈ ఏడాది దశ మహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు నేడు వినాయక చవితి పర్వదినాన వేద మంత్రోత్ఛరణల మధ్య స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నారు.

ఈ మహాక్రతువుకు ఉదయం 9:30 గంటలకు తొలి పూజను గవర్నర్‌ తమిళిసై సౌందరారాజన్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి నిర్వహిస్తారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *