రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కడుపునొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుకు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వీరన్న ప్రకారం ముస్తాబాద్ మండల కేంద్రం చెందిన కాంతుల దేవయ్య (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కడుపునొప్పి తగ్గకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నానని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతునికి ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నట్లు సమాచారం.




