సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆదివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం పూజారి శేషం శ్రీనివాసచారి, ఆలయ అధ్యక్షులు బుక్క రమేష్ గుప్త మాట్లాడుతూ మట్టి విగ్రహాలు పూజించడం శ్రేష్టమని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయం అని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ ఇంటర్నేషనల్ యువజన విభాగం అధ్యక్షులు ఉత్తనూర్ సంపత్ గుప్తా, చకిలం సంపత్ గుప్తా, అత్తెల్లి రవీందర్ గుప్తా,గుడాల శేఖర్, రవి,నాగేష్,వినయ్ ,నాగరాజు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు