ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం ముక్తకంఠంతో డిమాండ్ చేశారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కిరాణా వర్తక సంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్, కిరాణావర్ధక సంఘం అధ్యక్షులు సిద్ధి బిక్షపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని ఆర్యవైశ్యులు ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని అన్నారు రాబోయే ఎన్నికల సమయం లోపల ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి లక్ష్మయ్య, ఓంకార్, తోట బిక్షపతి, మెట్ రాములు, వైకుంఠం, రుక్మయ్య, దూబగుంట ప్రభాకర్, శివకుమార్, లచ్చలు,రాములు, తదితరులు పాల్గొన్నారు




