Breaking News

ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

230 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పులిమామిడి కిష్టాపూర్ మాజీ సర్పంచ్, దుబ్బాక నియోజకవర్గ బిజెపి నాయకులు నాయిని రాజగోపాల్ లింగరాజు పల్లి, ఉప్పర్ పల్లి, దీపాయంపల్లి గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. అలాగే ఎస్సీ హాస్టల్, కస్తూరిబా హాస్టల్ లో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లింగరాజు పల్లి సర్పంచ్ కేత కనకరాజు, బిజెపి మండల అధ్యక్షుడు పోతురాజు కిషన్, నాయకులు రాజా గౌడ్, చంద్రం, నవీన్, నర్స గౌడ్, స్వామి, మర్కంటి నర్సింలు, ఆంజనేయులు, శ్రీనివాస్, రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *