కోరుట్ల మండలం లోని పైడిమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన గ్రామస్థులను కంటతడి పెట్టించింది వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన నేమిల్ల సురేంధర్ (44) భారత సైన్యంలో జవానుగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు. హఠాత్తుగా శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయి చివరకు తన వ్యవసాయ బావిలోనే శవమై తేలాడు.
చనిపోయే ముందు కాళ్లు, చేతులను ఇనుప తీగతో కట్టి బంధించుకుని బావిలో దూకినట్లు కనిపిస్తున్నది. రోజూ సాయంత్రం స్వయంగా వచ్చి పిల్లలను పాఠశాల నుండి ఇంటికి తీసుకెళ్లే ఆయన శుక్రవారం పాఠశాలకు కూడా వెళ్లలేదని కుటుంబ సభ్యులు రోదించారు.మృతునికి భార్య ఉమ, కొడుకు విక్రాంత్ రెడ్డి, కూతురు నిశిత రెడ్డి లు ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.