తల్లి తండ్రులకు అన్నం పెట్టనివాని
ఇంటికి ఏ ఫంక్షన్ ఉన్న వెళ్ళకూడదు
దండోరా పేరుతో వాట్సాప్, ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది
సిరిసిల్ల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జూలై 04 :
కనిపెంచిన తల్లి తండ్రులకు వృద్దాప్యంలో అన్నం పెట్టా లేని వాళ్ళ ఇంటికి ఏ దావత్ , ఏ ఫంక్షన్ ఉండి పిలిచినా ఎవరు వెళ్ళకూడదని వాళ్ళను మన ఇళ్లల్లోకి రానివ్వకూడదని వాట్సప్, ఫేస్ బుక్ లో దండోరా పేరుతో పెట్టిన పోస్ట్ విశేషంగా వైరల్ అవుతుంది,
అలా ప్రతి ఒక్కరు తమ తమ ఊర్లల్లలో తల్లిదండ్రులు కు అన్నం పెట్టని వాళ్ళను తల్లి తండ్రుల యోగక్షేమాలను చూడలేని వాళ్ళ గురించి వాట్సాప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని దండోరా పేరు తో పెట్టిన పోస్ట్ ను స్పందిస్తూ వారు కూడా వారివారి ఫ్రెండ్స్ కు సంబంధించిన వాట్సప్ గ్రూప్ ల్లో , ఫేస్ బుక్ ల్లో షేర్ చేస్తున్నారు, ఏ సెల్ ఫోన్ల లలో చూసిన ఇదే పోస్ట్. ఏ గ్రామంలో చూసినా ఇదే చర్చ కొనసాగుతోంది,
వృద్ధులైన తల్లి తండ్రుల యోగక్షేమాలను కుమారులు గాని కూతుర్లు గాని చూడకపోతే జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్ కు ఠానా దివాస్ లోనైన , ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం లో జరిగే ప్రజాదీవాస్ లో కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా పిర్యాదు చేయవచ్చు,
