రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసం సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. దీనిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ నగర్ సెక్టార్ లోని అంబేద్కర్ నగర్ పాఠశాలలో పోషణ మాసం ఉత్సవాలని నిర్వహించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమ అధికారి శ్రీ పి. లక్ష్మీరాజం, స్థానిక కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల గారు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ, సూపర్వైజర్ అంజలి, అంగన్వాడీ టీచర్లు ,డిస్టిక్ హబ్ పర్ ఉమెన్ ఎంపవర్మెంట్ దేవిక , త్రివేణి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ రాజు అంగన్వాడీ ఆయాలు తల్లిదండ్రులు పిల్లలు పాల్గొన్నారు… ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని దానిలో భాగంగా బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ప్రీస్కూల్ పిల్లలకు ఆరోగ్యలక్ష్మి లో భాగంగా మంచి నాణ్యమైన పోషకాహారం వేడి భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు.
అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా బాలామృతము పప్పు పాలు ఎగ్స్ మొదలైనటువంటి అన్ని రకాల సంపూర్ణ పోషకాహారం అందించడం జరుగుతున్నదని వివరించారు. ఇందులో భాగంగా పాలు మరియు ఎగ్స్ 30 రోజులకు ఇవ్వబడుతుందని మిగతావి అంగన్వాడి కేంద్రం పనిచేసిన ఎన్ని రోజులు ఇస్తారని వివరించారు. అలాగే స్థానికంగా లభించే కూరగాయలను ప్రతిరోజు తప్పనిసరిగా తాజా కూరగాయలను తీసుకుంటూ తాజా ఫలాలను తీసుకోవాలని సూచించారు.
ఋతువులను బట్టి వచ్చే పండ్లు జామ, నిమ్మ, బత్తాయి ,బొప్పాయి సపోటా లాంటి స్థానిక ఫలాలను తీసుకోవాలని అలాగే చిక్కుళ్ళు, అలసందలు, బఠాణీలు, బబ్బర్లు, క్యారెట్ లాంటి కూరగాయలతో పాటు తోటకూర, ఆకుకూర, బచ్చలి కూర ,పాలకూర లాంటి ఆకుకూరలు కూడా తీసుకోవాలని సూచించారు. అలాగే చిరుధాన్యాలు ఆయన జొన్నలు సజ్జలు రాగులు, కొర్రలు లాంటి ఆహార పదార్థాలను ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పిల్లలకు టి హెచ్ ఆర్ పంపిణీ చేయడం జరిగింది…