సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శనివారం రోజున బయ్యారం గ్రామం లో సర్పంచ్ శ్రీ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు (బాలెంనత) లో పోషణ ఆహార లోపం లేకుండా ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఐసిడిఎ సూపర్ వేజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీలు’మరియు బాలెనంత వారి ఆరోగ్యం నిమిత్తం చిరు ధాన్యాలు అయినటువంటి సజ్జలు,కొర్రలు,రాగులు, అరిసెలు, పెసర్లు,సామలు,మినుములు, జొన్నలు,అటుకులు,బెల్లం అలాగే ఆకుకూరలు గురించి వాటి వల్ల గర్భిణీలకు లభించే పోషణ గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు కృష్ణ రెడ్డి , పాఠశాల ప్రధానోపాధ్యాయులు .అలాగే ఆశ వర్కర్లు, ఎఎన్ఎం అనిత ,అరుణ, మేట్టమ్మా అలాగే అంగన్వాడీ టీచర్లు చిలివేరి అనిత, మరియు స్రవంతి పాల్గొనడం జరిగింది. ఈ విధంగా గ్రామం బయ్యారం లో పోషకహర సంబరాలు విజయవంతం చేయడం జరిగింది.




