టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా 70 బంతుల గ్యాప్ తర్వాత బౌండరీ కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమైన భారత జట్టు… లక్ష్య ఛేదనకు దిగిన విలియమ్సన్ సేనను కట్టడి చేయలేక పరాజయం మూటగట్టుకుంది.
