ఆధ్యాత్మికం

ప్రభుత్వ పాఠశాలలో మట్టి విగ్రహాలు వితరణ

76 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మట్టి వినాయకుల విగ్రహాలు 300 మంది శనివారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుబ్బెడ హనుమాన్లు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం పై అవగాహన విద్యార్థులకు కల్పించామని పిఓపి విగ్రహాలను వాడటం వలన కలిగే నష్టాలను వివరించామని పేర్కొన్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ వారి నుండి మట్టి విగ్రహాలను తెప్పించి అందజేశామన్నారు.పర్యావరణంపై స్లొగన్స్ ప్లకార్డులు విద్యార్థులకు అందజేసి అవగాహన కల్పించామన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వామి, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, వెంకట్, శ్రీనివాస్, మధుసూదన్, శ్రీనివాస రాజు, కృష్ణాహరి,రాములు, ఆనందం, ఇందిరదేవి, త్రివేణి,జయశ్రీ,లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *