-మట్టి వినాయకుని తయారుచేసిన విద్యార్థులు.
వినాయక చవితి సంబరాలను విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు వినాయక చవితి సందర్భంగా జరిగే వేడుకలను నిర్వహించారు. స్థానిక చెరువు నుండి బంక మట్టిని తీసుకువచ్చి వినాయకుడి రూపాలను తయారుచేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా . పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో వినాయక చవితి ఉత్సవాలను ముందస్తుగా నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం పండుగలను పాఠశాల ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ విద్యార్థులలో పండుగలు విశిష్టతను వివరిస్తున్నారు. మట్టి వినాయకుని పూజిస్తాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. చెరువులు బాగా నీటితో నిండి ఉన్నందున వినాయకుడిని నిమజ్జనం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది బాల్రెడ్డి, రమాదేవి, వంశీకృష్ణ, స్రవంతి, మంజుల విద్యార్థులు పాల్గొన్నారు.