ములుగు సెప్టెంబర్ 16:ప్రభుత్వ జూనియర్ కళాశాల ములుగు లో స్వాగతోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.