– నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు
తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో ఈ నెల 17న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ని అరెస్టు చేసిన ఎల్ఎండి పోలీసులు, ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలగోర్ల గోపాలకృష్ణ ఆర్మీ ఉద్యోగ నిమిత్తము కోచింగ్ తీసుకొనుటకై గత కొన్ని నెలల క్రితం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలోని ఒక శిక్షణ కేంద్రం కు వచ్చి శిక్షణ తీసుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో విలాసలకు అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో దొంగతనాలు చేయడానికి నిర్ణయం తీసుకొని, తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామం లో ఈనెల 17న మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళము వేసిన ఇంటిని పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న నగదును, బంగారు ఆభరణాలు తో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు ఏటీఎం కార్డు లైసెన్సులు దొంగిలించి అదే ఇంట్లో ఉన్న ఒక బ్యాగులో వేసుకొని, కరీంనగర్ కు వెళ్తూ వెళ్తూ కెనాల్ లో ఆధార్ ఏటీఎం ఇతర కార్డులను పారవేసి కరీంనగర్ కు వెళ్లి అక్కడి నుండి హైదరాబాదుకు తిరిగి హైదరాబాదు నుండి గుంటూరుకు బస్సులో వెళ్లి దొంగలించిన సొమ్ము లో నుండి, 20 వేల నగదును నిందితుడు అతని మామయ్య కు ఇచ్చి, బంగారు ఆభరణాలను ఫెడ్ బ్యాంక్ నందు కుదువ పెట్టగా వచ్చిన డబ్బులతో పాటు దొంగతనం చేసిన డబ్బుల నుండి 20 వేలు విలాసాలకు ఖర్చు చేసి తిరిగి ఎప్పటిలాగే కరీంనగర్ వస్తు అలుగునూర్ వద్ద బస్ దిగగా, శనివారం ఎల్ఎండి కాలనీ పోలీసులు పట్టుకొని నిందితుడు నుండి దొంగతనమునకు సంబంధించిన 40 వేల నగదు ను స్వాధీనపరుచుకొని నిందితుడు గోపాలకృష్ణను ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి అరెస్టు చేసి రిమాండ్ కు పంపినారు. నిదందితుడుని పట్టుకోవడంలో సిసిఎస్ మధుకర్ రెడ్డి సిసిఎస్ సిబ్బంది, ఎల్ఎండి పోలీస్ స్టేషన్ సిబ్బంది ని సీఐ ఇంద్రసేనారెడ్డి అభినందించారు.ఇట్టి సమావేశంలో ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, సిసిఎస్ఏ మధుకర్ రెడ్డి, స్టేషన్ సిబ్బంది సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.





