సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్
సెప్టెంబర్ 16
సిద్దిపేట జిల్లా ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి సిపిఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి హాజరై మద్దతునిచ్చి మాట్లాడారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సర్వ శిక్ష ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత 15 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు 16 రోజులు గడిచిన ప్రభుత్వం స్పందించలేదు ఇది సిగ్గుచేటు అని అన్నారు
ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఏ జిల్లా అధ్యక్షుడు బాలకిషన్ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు
