Breaking News

రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్ధిదారులు చౌక ధరల దుకాణం లో ఈ కే వై సి చేయించుకోవాలి

224 Views

గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 16తెలుగు న్యూస్ 24/7

*రాజన్న సిరిసిల్ల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి*

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో ఆహార భద్రత కార్డులలో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారు స్థానిక చౌకధరల దుకాణాలలోకి వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి అన్నారు. అనర్హమైన రేషన్ కార్డులు తొలగించేందుకు అసలైన లబ్ధిదారులకు లబ్ధి పొందాలని, ముందు ముందు కొత్తవారికి నూతన ఆహార భద్రత కార్డులు జారీ చేయాలనే ఉద్దేశంతో ఈ కేవైసీ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి చెప్పారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు వందల నలుబై ఐదు రేషన్ దుకాణాలుండగా అన్నపూర్ణ కార్డులు రెండువందలపది , అంత్యోదయ కార్డులు పదమూడు వేయిల ఏడు వందల రెండు, ఆహార భద్రత కార్డులు ఒక లక్షా అరవై వేయిల అరవై ఉన్నట్లు అధికారి తెలిపారు. రేషన్ కార్డులలో ఉన్న లబ్ధిదారులు కొందరు మరణించినా రేషన్ బియ్యం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చిందని తెలిసింది. చౌక ధరల దుకాణాల ద్వారా తీసుకుంటు పక్కదారి పట్టిస్తున్నారని దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని గ్రహించి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిసింది. ఆహార భద్రత కార్డులలో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి అన్నారు.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *