సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 15 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన గుర్జకుంట రాములమ్మ భర్త పోచయ్య అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి సహకారముతో సీఎం సహాయ నిధికి మంత్రి హరీష్ రావు వద్ద అప్లై చేసుకోగా గ్రామ సర్పంచ్ శ్రీపతి రాజేశ్వరి రవి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల అంజయ్య 14000 రూపాయల చెక్ ను రాములమ్మకు అందజేయడం జరిగింది లబ్దిదారులు రాములమ్మ సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుకి మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమములో కో ఆప్షన్ సభ్యులు నర్రా కనకయ్య, గువ్వ రమేష్, కుల పెద్దమనిషి నర్రా పెద్ద ఇస్తారి , ఫీల్డ్ అసిస్టెంట్ అరుముల్ల నర్సింలు, గ్రామ ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు అరుముళ్ళ నాగరాజు నర్రా నారాయణ మరియు నర్రా రామచంద్రం పాల్గొన్నారు