ప్రాంతీయం

వీర సావర్కర్  జయంతి వేడుకలు

72 Views

ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో-వీర సావర్కర్  జయంతి వేడుకలు

సిద్దిపేట జిల్లా మే 28

సిద్దిపేట జిల్లా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ సావర్కర్ 141వ జయంతిని పురస్కరించుకొని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల పవన్ కుమార్,సావుల ఆదిత్య సావర్కర్ విగ్రహానికి పులమాల వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ  పేరులోనే స్వాతంత్రం జీవితమే స్వాతంత్ర పోరాటం అని భరతమాత ముద్దుబిడ్డ దేశం కోసం 25 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడని మధన్ లాల్ టింగ్ర, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో గొప్ప గొప్ప దేశభక్తులకు స్పూర్తిగా నిలిచిన మహనీయుడని రచనలతో కవితలతో ప్రసంగాల ద్వారా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిలించిన వీరుడని అన్నారు

నేటి యువతకు స్వాతంత్ర వీర సావర్కర్  మార్గదర్శకంగా నిలిచారు సావర్కర్  పటిమాస్ఫూర్తితో యువత మొత్తం  అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హరీష్, డిగ్రీ కళాశాల అధ్యక్షులు వివేక్ ,డిగ్రీ కళాశాల కార్యదర్శి పరశురాం, ఫణిందర్భీమన్, భీమన్న, చరణ్,వంశీ,రాహుల్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్