రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆద్వర్యంలో, గ్రామీణ ప్రాంత కిశోర బాలికల కోసం జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారితో, మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఒప్పందం పత్రాన్ని మంత్రివర్యులు, తారక రామారావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం కిశోర బాలికలకు, మహిళలకు, ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాలలో అనేక వసతులు, సౌకర్యాలను కల్పిస్తున్నది. గ్రామీణ ప్రాంతం మరియు మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థినిలు ఆధునిక ప్రపంచంతో పోటీపడేలాగా జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రణాళికలు రూపొందించింది.
జిల్లా యంత్రాంగం, మంత్రివర్యులు,తారక రామారావు ఆదేశాలతో జిల్లాలో చదువుతున్న బాలికలు అందరికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి ప్రపంచ ప్రతిష్టాత్మక సంస్థ సామాజిక శాస్త్రాలలో రారా అని, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, ముంబై వారి సహకారంతో ఒక ఒప్పందానికి రావడం జరిగింది. దీనిలో భాగంగా పిల్లలకు సైన్స్ పాఠాలు, టెక్నాలజీ, ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్స్ మొదలైన సబ్జెక్టులలో నైపుణ్యం పెంపొందించడానికి ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లింగ వివక్ష అంతమొందించడానికి లింగ సమానత్వము సాధికారిక సాధించడం కోసం యవ్వన దశ నుంచే ఏర్పాట్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఆధునిక పోటీ ప్రపంచంలో పిల్లలకి కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ కేజీబీవీ పాఠశాలల్లో నూతన వరువాడితో ఈ లాబరేటరీలు స్థాపించబడుతున్నాయి.