ఆయష్మాన్ భారత్ కార్యక్రమo లో భాగంగా ప్రతి నెలా 14వ తేదీన నిర్వహించే ఆరోగ్య మేళ లో బాగంగా ఎల్లారెడ్డి పేట లోని సామాజిక ఆసుపత్రి లోటిబి నిక్షయ్ దివాస్- క్షయ వ్యాధి అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండ్టెంట్ డా.బాబు ఆధ్యర్యంలో టిబి -హెల్త్ మేళా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, మధుమేహ గ్రస్తులు, వృద్ధులు, కాన్సర్, కొవీఢ్ , ఆస్థమా, ఓపి రోగులకు క్షయ వ్యాధి పై అవగహన కల్పిoచారు. రెండు వారాలుమించి దగ్గు, జ్వరం,రాత్రిపూట చెమటలు,ఆకలి మందగించడం ,బరువు తగ్గడం వంటి లక్షణాలతో బాధపడేవారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి వైధ్యులను సంప్రదిoచాలని సూచించారు.గతంలో అర్ టి, పి సీ అర్,డ్రగ్ రేసి స్తెన్స్, తేమడ పరీక్షల కొరకై సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి వెళ్ళేవారని ప్రస్తుతం ఎల్లరెడ్డిపెట సామాజిక ఆరోగ్య కేంద్రంలొనే ఉచితంగా పరిక్షలు,టిబి ముందులు ఇస్తున్నామని తెలిపారు. నిక్షయ్ యోజన పథకం కింద టిబి గ్రస్తులకులకు 6 నెలలు నెలకి 500 రుపాయ ల తో పాటు డా. సత్యనారాయణ అశ్విని హాస్పిటల్ సేవలతో ప్రతి క్షయ వ్యాధి గ్రస్తూలకు ఉచితంగా బియ్యం,పప్పులు,నూనె,ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నామని తెలిపారు. దగ్గు, క్షయ వ్యాధి లక్షణాలు ,జనాలు గుంపులుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పేస్ మాస్క్ ధరించిలన్నారు. క్షయ వ్యాధిని ఎదుర్కునేలా రోగ నిరోధక శక్తి పెంచుకునేలా మంచి పౌష్టిక ఆహారం తో వ్యాయామం చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమoలో డా.రఘు,డా.ప్రదీప్, సీనియర్ టిబి ల్యాబ్ సూపర్వైజర్ నాగరాజు, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ మమత , స్టాఫ్ నర్స్ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.
