సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది…
ఆంగ్ల రచయిత కొండ మురళికి గౌరవ సత్కారం)
సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తున్నదనీ, ప్రాచీనకాలం నుండి నేటివరకు రచయితలెందరో రచనలు చేసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించారనీ అటువంటి రచయితలను మరిచిపోకుండా స్మరించాలనీ, గౌరవించాలని తెలంగాణ వివేక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు.
తేదీ 16-05-2023రోజున యెల్లారెడ్డిపేటలో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆంగ్ల రచయిత కొండ మురళిగారిని శాలువా ప్రశంసాపత్రంతో గౌరవ సత్కారం చేశారు.
ఈ సందర్భంగా డా.వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ కొండ మురళిగారు గ్రామీణ ప్రాంతానికి చెందినవారైన మాతృభాష తెలుగు అయినప్పటికీ ఆంగ్లంలో పట్టు సాధించడంతోపాటు ఆంగ్లంలో రియల్ డ్రీమ్స్,ది పీల్స్ ఆఫ్ లైఫ్, ది రాచర్లఫోర్ట్,బిట్టర్ స్వీట్ జ్యూసెస్,లాక్ డౌన్ స్టోరీస్, ఫర్గెట్ ఆండ్ ఫర్గివ్ మొదలగు 18 పుస్తకాలు రచించారనీ తెలంగాణకు ఈ ప్రాంతానికి గర్వకారణం అన్నారు. ఈ రచనలన్నింటిలో యస్ ఐ ఫీల్ ఇట్ అనే పుస్తకం ఒక మహాకావ్యంలాంటిదనీ, దీనిని రాయడానికి మూడున్నర సంవత్సరాలు పట్టిందనీ ఇందులో 1001 పద్యాలు ఉన్నాయనీ తెలిపారు.మురళి పుస్తకాలు అమేజాన్,ప్లప్కార్ట్ స్టోర్లలో కూడా లభ్యమవుతున్నాయన్నారు. వీరు ప్రస్తుతం జనగామ మోడల్ స్కూల్లో పిజిటి ఇంగ్లీష్ గా విధులు నిర్వహిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుంపెన రమేశ్, గజభీంకార్ అజయ్, మహమ్మద్ దస్తగీర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
