–మానకొండూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి.
(తిమ్మాపూర్ సెప్టెంబర్ )
తెలంగాణ విమోచన దినోత్సవం గా అధికారికంగా నిర్వహించాలని మానకొండూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి డిమాండ్ చేసారు.సెప్టెంబర్ 17 రోజున తెలంగాణ విమోచన దినోత్సవంపై బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మానకొండూర్ అసెంబ్లీ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ నుండి అల్గునూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీ ని ప్రారభించారు. సుమారు 100 బైక్ లతో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరువు ఎల్లన్న,గడ్డం నాగరాజు,సొల్లు అజయ్ వర్మ,జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేషం, మాడ వెంకట్ రెడ్డి,అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి,బొంతల కళ్యాణ్ చంద్ర,కొత్త శ్రీనివాస్ రెడ్డి,కార్యదర్శి రంగు భాస్కరచారి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూర్ మండలాల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,నగునూరి శంకర్, రాపాక ప్రవీణ్ తో పాటుగా వివిధ మండలాల ముఖ్యకార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.