గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలకు పోషకాహారం తప్పనిసరిగా అవసరమని గర్భిణులకు పుట్టబోయే బిడ్డ సురక్షితంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం అంగన్వాడి కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం పోషణ్ అభియాన్ లో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 30 వరకు పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.తల్లిపాల ప్రాముఖ్యత, పోషకాహారం గురించి వివరించడం జరిగింది. గర్భిణీ, బాలింత మహిళలు అందరూ తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని, అప్పుడే పండంటి బిడ్డకు జన్మనిస్తారని, బిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జన్మించాలి అంటే తల్లి తప్పనిసరిగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు ఎల్లప్పుడూ వైద్యుల సూచనల మేరకు ఆరోగ్య ఆహార నియమాలను పాటించాలని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలలో గర్భిణులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఒక్కరు రోజు పౌష్టికాహారం తీసుకోవాలని, పౌష్టికాహారం వలన కలిగే ఉపయోగాలపై గర్భిణీ,బాలింత స్త్రీలందరికీ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఈ సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడులకు గురి కావద్దని, ఆరోగ్యానికి హాని కలిగించే ఏ పని చేయకూడదని, ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా జన్మిస్తారని తెలియజేశారు. ప్రతి మహిళకు జీవితంలో అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంటుందని అమ్మతనం అనేది ఎంతో అద్భుతమైనదన్నారు. కాబట్టి గర్భిణీలు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, బాలింతలు, గర్భిణీలు వార్డ్ సభ్యులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.