ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన జగదేవ్పూర్ మండల ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి శ్రీరాముల కనుకయ్య మరియు వట్టిపల్లి గ్రామానికి చెందిన రజక సంఘం సభ్యులు మొత్తం ఈరోజు గజ్వేల్ లోని సీఎం మినీ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి గులాబీ కండువా వేసి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాప్ రెడ్డి
అనంతరం వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు, తెలంగాణ రాష్ట్రంలో మూడవసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపడతారన్నారు, గజ్వేల్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 1,50,000 మెజార్టీని ఇస్తామన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు గ్రూపు తగాదాలతో కాక వికాలం అవుతున్నాయని అన్నారు, ప్రతిపక్ష పార్టీల మీద ప్రజలకు నమ్మకం లేదన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి పెద్దగా, అన్నగా, మేనమామగా అన్ని విధాలుగా ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ కుటుంబ పెద్దన్న పాత్రను పోషిస్తూ ప్రతి గడపకు అవినీతి లేకుండా భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గడపగడపకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అన్నారు, గజ్వేల్ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారాయన్నారు గజ్వేల్ నియోజకవర్గం అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందన్నారు, మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారని తెలిపారు, వట్టిపల్లి నుండి సాల్వాపూర్ రోడ్డు నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు మంజూరూ అయ్యాయని తెలిపారు, వట్టిపల్లి నుండి సాల్వాపూర్ వరకు రోడ్డు నిర్మాణానికి 8కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన్నీరు హరీష్ రావు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు, గజ్వేల్ నియోజకవర్గం లో ప్రతిపక్షాలకు ధరావత్తు కూడా దక్కదన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాల ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు,
వివిధ పార్టీల నుండిబ్ దాదాపు 70 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారి పేర్లు
బసవరాజు గణేష్ కొమ్మేట చంద్రయ్య వడ్లకొండ నరసింహులు వడ్లకొండ కర్ణాకర్ బసవరాజ్ అంజయ్య సాయిలు కర్ణాకర్ దుర్గయ్య సత్తయ్య సాయికుమార్ శ్రీకాంత్ రాజేశ్వరి సాయిబాబా తిరుపతి రవి సంతోష్ రమేష్ మల్లయ్య చంద్రశేఖర్ మాణిక్యం నర్సింలు తదితరులు
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ పిఎసిఎస్ డైరెక్టర్ యశ్వంత్ రెడ్డి, విజయ్ కుమార్, మోహన్ రెడ్డి, శివారెడ్డి మాజీ సర్పంచ్ ఎల్లయ్య మండల వికలాంగుల అధ్యక్షుడు దేవానందం తదితరులున్నారు