ప్రాంతీయం

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు…

60 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి15 (24/7న్యూస్ ప్రతినిధి): స్థానిక మండల కేంద్రంలో గిరిజనులు శనివారం బంజారా ఆరాధ్య దైవంగా పూజించే శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286.వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలిండియా బంజారా మండల అధ్యక్షుడు లకావత్ నర్సింలు ఈ జయంతిని పురస్కరించుకొని మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించాలన్నారు. అదేవిధంగా స్థానిక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, మరికొందరు నాయకులు చొరవ తీసుకొని 2.గుంటలు స్థలాన్ని సేవాలాల్ మహారాజ్ కార్యక్రమాలు జరుపుకోవడానికి వసతిగా ఏర్పాటుచేసి మా గిరిజనులకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూడవత్ రెడ్డి నాయక్, మూడవత్ నాగరాజు, రెడ్డి నాయక్ గుగులోత్ రమేష్, మాజీ సర్పంచ్ దేవేందర్ భూఖ్య మధు గంగారం. సంతోష్ సింగ్, బంజారా గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7