సిరిసిల్లలో వినాయకుడి విగ్రహాన్ని డిజె సౌండ్ తో ఎదురుకొస్తుండగా ఆ సౌండ్ కు ఓ కార్మికుడి గుండె గుండెపోటుతో ఆగిపోయింది. గురువారం సిరిసిల్ల ప్రగతి నగర్ కాలనీలో అదే కాలనీకి చెందిన బుల్లి సత్యనారాయణ (48) అనే వ్యక్తి పవర్లూమ్ కార్మికుడిగా పనిచేస్తూ కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదే క్రమంలో స్థానిక వినాయక మంటప నిర్వాహకులు డిజె సౌండ్ తో వినాయకుని ఊరేగింపు ద్వారా తీసుకెళ్తుండగా ఆ సౌండ్ తట్టుకోలేక సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు అని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
