రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రయిపల్లి గ్రామ శివారులో చౌడాలమ్మ ఆలయంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షుడు రాగం నాగరాజు పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి ఎవరు గుర్తు తెలియని దుండగులు ఆలయం తలాలు పగలగొట్టి హుండీని బయటకు లాక్కెళ్ళి అందులో ఉన్న సుమారు 30 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయ అధ్యక్షుడు తెలిపాడు.ఈ చోరీపై పోలీస్ ఫిర్యాదు చేశారని అన్నారు.
