సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 14: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో విషజ్వరాలు ప్రబలకుండా దోమల మందు పిచికారీ చేసినట్టు సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో డెంగ్యూ ప్రబలుతున్న సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలుగా ఇటిక్యాల గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామం మొత్తం దోమల మందు పిచికారి చేయడం జరుగుతుంది అని అన్నారు.