దౌల్తాబాద్: సృజనాత్మకతతో విద్యార్థులకు బోధన సులభతరం అవుతుందని జిల్లా సెక్టోరియల్ అధికారి రంగనాథ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు చాలా కష్టపడి టీఎల్ఎం తయారు చేశారని గదిలో విద్యార్థులకు బోధించినట్లయితే తొందరగా బోధన అర్థం చేసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని అన్నారు. ఇదే స్ఫూర్తితో తరగతి గదిలో కూడా విద్యార్థులను వారి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. కాగా ఉపాధ్యాయులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సమ్మ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రకాశం, ప్రధానోపాధ్యాయులు బసవరాజ్, రత్నాకర్ రెడ్డి, సీఆర్పీలు పాల్గొన్నారు..




