. ముస్తాబాద్, సెప్టెంబర్15, నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుచేతుల మీదుగా వర్చువల్ గా మెడికల్ కళాశాల ప్రారంభం చేసుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా మండలం నుండి అధిక సంఖ్యలో వెళ్లి సభను ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు గురువారం రోజున మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశ కార్యక్రమంలో విజయవంతం చేయాలని పలు అంశాలపై చర్చించారు. ఈకార్యక్రమంలోమండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏఎంసి చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, ఎంపిటిసి కంచం మంజుల నర్సింలు, బైతి దుర్గమ్మ నవీన్ లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
