మంచిర్యాల జిల్లా.
ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం పై మరియు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంతో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం గడిచిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని అన్నారు. రైతులను, మహిళలను, నిరుద్యోగ యువతను, వృద్ధులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టిస్తూ అల్లర్లను ప్రేరేపిస్తూ ఉన్నారని, అభివృద్ధి పేరుతో ఎలాంటి నోటీసులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి మంచిర్యాల వ్యాపారస్తులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో గెలిచాక 6 నెలల్లో మంచిర్యాలలో టూ టౌన్ రైల్వే వంతెన, 100 రోజుల్లో ఎల్లంపల్లి భూ నిర్వాసితుల పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఎం అయ్యిందని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా పెద్దపల్లి జిల్లాల మధ్య గోదావరి పై రైల్వే వంతెన గత BRS ప్రభుత్వం 10 ఏండ్లు కాలయాపన చేసి టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తే ఇప్పడు ఉన్న ఎమ్మెల్యే కమీషన్ కోసం ఆ కాంట్రాక్టు రద్దు చేయడంతో రెండు జిల్లాల ప్రజలు రవాణా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎన్నికల సమయంలో 40,000 ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసి అతని కొడుకు మాత్రం ఉద్యోగం ఇచ్చాడని విమర్శించారు. వివేక్ వెంకట్ స్వామి కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోతున్న గ్రామాలకు కర కట్ట నిర్మాణం చేపడతామని ఇచ్చిన హామీ ఏం అయిందని ప్రశ్నించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని మాట ఇచ్చి ప్రజలకు అందుబాటులోనే ఉండడం లేదని వాపోయారు. వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. ఇల జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాడతాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, రజనీష్ జైన్, ఆరుముళ్ల పోషం, పట్టి వెంకట కృష్ణ, గుండా ప్రభాకర్, అమరరాజుల శ్రీదేవి, ఆకుల అశోక్ వర్ధన్, ఎనగందుల కృష్ణ మూర్తి, మోటపలుకుల తిరుపతి, అక్కల రమేష్, రాచర్ల సంతోష్ వాణి శ్రీ మరియు తదితరులు పాల్గొన్నారు





