దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటాం అని మామిడి మోహన్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలా పరిధిలోని పులిమామిడి, కిష్టాపూర్, చిటోజిపల్లి, గ్రామాలలో కొద్దిరోజుల క్రితం మరణించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కుటుంబాలు మాందాపూర్ స్వామి, మాందాపూర్ రామస్వామి, కురుమ గంగయ్య, బీరయ్య భార్య శమవ్వ, అక్కల సత్తయ్య, వెంకట్ శివ కుమార్, వెంకట్, కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటానని వారికి అండగా ఉంటూ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పులిమామిడి సర్పంచ్ రమేష్, నారం రెడ్డి, ఎలా గౌడ్, రవీందర్ రెడ్డి, కిష్టాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బాబు, చిట్టోజ్ పల్లి, పల్లి ఉపసర్పంచ్ పరశురాములు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, యాదగిరి, స్వామి, పరశురాం, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
