నిన్న 24 గంటల నిరుద్యోగ దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడానికి నిరసిస్తూ
సెప్టెంబర్ 14
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తోడుపునూరి రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 2018 లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క నిరుద్యోగికి 3016 చొప్పున గత 57 నెలల నిరుద్యోగ భృతి అక్షరాల 1,71,912 రూపాయలు వెంటనే అకౌంట్లోకి పంపించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. దీనిలో బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తి మహేష్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గోపాల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు
