గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలు పరిష్కారం కావడం లేదని బిజెపి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవారెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలపై బిజెపి చేస్తున్నటువంటి పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమం ద్వారా స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహిస్తున్నది.ఈ క్రమంలో గురువారం మండలంలోని నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామాల్లోని శక్తి కేంద్రాల్లో మండల శాఖ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ లను జరిపారు.ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన వాసుదేవారెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల వస్తున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కారించడం లేదని అన్నారు. నియంతృత్వ ధోరణి తో వ్యవహారిస్తూ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టాలని అన్నారు. లిక్కర్ వ్యాపారం ద్వారా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న స్కామ్ వల్ల మహిళా లోకానికి తీరని అవమానమని విమర్శించారు.ప్రతీ గ్రామం లో జరుగుతున్న అభివృద్ధి లో కేంద్రం నిదులే ఉన్నాయని ప్రజలకు వివరించాలని సూచించారు.గ్రామాల్లోని పేద,మధ్య తరగతి ప్రజలకోసం కేంద్రం లోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నోరకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని వాటన్నింటిని బూత్ ల వారిగా వివరించాలని కోరారు.గ్రామ, గ్రామాన సంస్థాగతంగా పార్టీ ని బలోపేతం చేసి ప్రజాప్రతినిధులుగా ఎదగాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల సంక్షేమం కోసం బిజెపి పనిచేస్తుందని తెలిపారు.రాబోయే రోజుల్లో బిజెపి అధికారం లోకి రాబోతుందని కార్యకర్తలు ఉత్సాహం తో పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, మండల ఇంచార్జి సాయిని మల్లేశం,బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,శక్తి కేంద్ర ఇంచార్జి లు తాళ్లపెల్లి రాజు గౌడ్,బండి సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మిశెట్టి మల్లయ్య,బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్,బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,ఓబీసీ మోర్చా అధ్యక్షులు దుర్సెట్టి రమేష్, ఆయా గ్రామాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




