రాజన్న సిరిసిల్ల జిల్లా కు ప్రభుత్వ వైద్య కళాశాల ఓ వరంలా మారనుంది.ఇన్నాళ్లు వైద్య కళాశాల లేక సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు.ఏదైనా పెద్ద వ్యాధి వస్తే చికిత్స పొందాలన్నా.. మెరుగైన వైద్యం దొరకాలన్నా హైదరాబాద్కు పరిగెత్తాల్సి వచ్చేది.తద్వారా దూర,ఆర్థికభారంతో ప్రజలు, ముఖ్యంగా పేదలు తల్లడిల్లిపోయి అప్పులపాలై చితికిపోయేవారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది.తక్కువ సీట్లు అందుబాటులో ఉండడంతో తెలంగాణ విద్యార్థులకు మెడిసిన్ విద్య కష్టతరంగా ఉండేది. స్వరాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను పేదలకు చేరువ చేయడంతో పాటు వైద్యవిద్య అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే 100 మందికి పైగా వివిధ విభాగాల నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండనున్నారు.