పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలపై రూపొందించిన పోస్టర్‌ను అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ గురువారం సాయంత్రం కలెక్టరేట్ ఆవిష్కరించారు. అధికారులకు మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ…పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB) పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తోందని, ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 2000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.