ప్రకటనలు

జిల్లావ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం..

141 Views

అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాలలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల జరుగుతున్న వివక్ష, ఆసమానతలు, అడ్డంకులు, అపోహలు మూఢనమ్మకాలపై విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన ఇవ్వడం జరిగింది.

అన్ని మండలాలలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలాగే సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే బుధవారం రోజు కోనరావుపేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం ముఖ్యఅతిథిగా హాజరై పిల్లలకి బాలిక విద్యా ప్రాముఖ్యత, ఆస్తిలో హక్కు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, వరకట్నం దురాచారం, ఇతర సాంఘిక దురాచారాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే సమానత్వము, జీవించే హక్కు, భాగస్వామ్యపు హక్కు అభివృద్ధి చెందే హక్కుల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *