ముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం
కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్
ఎల్లారెడ్డిపేట జనవరి 11 :
ఎల్లారెడ్డిపేట మండల నారాయణ పూర్ గ్రామానికి చెందిన బొల్గం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గా గురువారం నియమితులయ్యారు.శ్రీనివాస్ గౌడ్ మొదట ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు విలేఖరిగా తన జర్నలిజం కెరియర్ ను ప్రారంభించారు అనంతరం సాక్షి బ్యూరో ఇన్చార్జిగా కరీంనగర్ వరంగల్ హైదరాబాదులో పనిచేశారు అనంతరం వెలుగులో చీప్ బ్యూరోగా పనిచేస్తూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు,
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పి ఆర్ ఓగా నియమితులవ్వటం విశేషం నారాయణపురం గ్రామానికి చెందిన పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు బొలగం వెంకటయ్య రాజవ్వ దంపతులకు రెండవ కుమారుడైన శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి పిఆర్ఓ గా నియమించడం పట్ల నారాయణ పూర్ సర్పంచ్ నిమ్మ లక్ష్మీ నారాయణ రెడ్డి ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్, ఎంపిటీసీ సభ్యులు ఆపేరా సుల్తానా మజీద్ లతో పాటు గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఎం డి మజీద్ ,నిమ్మ బాల్ చందర్ రెడ్డి,ఎదురుగట్ల ముత్తయ్య గౌడ్ , కాసు శ్రీ నివాస్ రాజు గౌడ్ , బండారి బాల్ రెడ్డి , ఇల్లందుల రాజు రెడ్డి, గౌరీశంకర్ , షరీఫ్ , జగదీష్ , నరేష్, కందుకూరి రవి, శ్రీ రామోజూ ప్రవీణ్ , శ్యామంతుల అనిల్ , కులేర్ కిషోర్ , దీప్తి, కృతజ్ఞతలు తెలిపారు,
