ఆర్మీ జవాన్ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం….
జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మి హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాదంలో యువ జవాన్ ని కోల్పోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
