సిరిసిల్ల జిల్లాలో అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరూ తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు .
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ లు ,బి ఎల్సూ ఓ పర్‌వైజర్లు, ఏపీఎం లతో విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఫోటో సిమిలర్ ఎంట్రీ ల డెస్క్ వెరిఫికేషన్ పకడ్బందీగా చేపట్టాలని, పొరబాటున ఓటరు జాబితా నుంచి ఎవరైనా డిలీట్ అయితే వారిని తిరిగి ఓటరు జాబితాలో చేర్పించేలా చూడాలనీ స్క్రూటినీ అధికారులను ఆదేశించారు.
మండలాల వారీగా ఆన్లైన్, ఆఫ్లైన్ లో వచ్చిన ఫారం-6,7,8 దరఖాస్తులు,ఇంకా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆఫ్ లైన్ లో వచ్చిన అన్ని ఫారం లను వెంటనే ఆన్లైన్ చేయాలని జిల్లా కలెక్టర్ తహశీల్దార్ లను ఆదేశించారు.
అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 18 సంవత్సరాలు నిండి మార్కింగ్ కానీ దివ్యాంగులను వెంటనే గుర్తించి ఫారం-6 ద్వారా ఓటర్లుగా నమోదు చేయాలన్నారు. అలాగే పోలింగ్ కేంద్రం వారీగా 18-19 ఎండ్లు నిండిన వ్యక్తుల వివరాలను పాఠశాలల వివరాలు సేకరించి అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారినీ ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్లచే జారీ చేయనైనది.