ముస్తాబాద్, పిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారి పై మండలంలోని నామాపూర్ బస్టాండ్ సమీపంలోని సాయంకాలం ఓపెన్ జిమ్ వద్ద లింగన్నపేట వైపు నుండి వస్తున్న టీఎస్ 3యుబి 7505 నంబర్ గల గూడ్స్ ఆటో ముస్తాబాద్ వైపు నుండి ఏపీ 15 ఏవి2628 నెంబర్ గల హెచ్ఎఫ్ డీలక్స్ బైకును ఢీ ఢీకొనగా బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు వారిని చూసి పరిస్థితి విషమంగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అత్యవసరంగా ప్రమాద స్థలాన్ని చేరుకొని బాధితులనిద్దరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సైశేఖర్ రెడ్డి తెలిపారు. వీరు ఇరువురి లింగన్నపేటకు చెందినవారని తెలపగా కానీ ఆ వ్యక్తులు గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన నర్సింలు,(తండ్రి) ముత్తయ్య 50సం.చనిపోగా మరొకరు దేవయ్య, (తండ్రి) లక్ష్మయ్య47సం. కాలుచేయి ప్యాచర్ కాగా వీరీరువురు అన్నదమ్ముల కొడుకులని108 సిబ్బంది ద్వారా తెలిసి వచ్చింది. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
