Breaking News

తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదు. కాంగ్రెస్ కు బాధ్యత లేదని మంత్రి హరీష్ రావు అన్నారు..

103 Views

సిద్ధిపేట జిల్లా

తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి బరువు లేదు. కాంగ్రెస్ కు బాధ్యత లేదని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఇవాళ రూ.19 వేల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభించుకోవడం సంతోషమన్నారు. ఒకప్పుడు హుస్నాబాద్ అన్నీ గుంతల రోడ్లు ఉండేవని,ఇప్పుడు అన్ని సీసీ రోడ్లు అయ్యాయని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రూ.7752 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు.రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రెండు పంటలకు ఢోకా లేదన్నారు.తెలంగాణ కోసం కేంద్రంలో కొట్లాడం కాంగ్రెస్ చేతకాదని,60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందా..? అంటూ సూటిగా ప్రశ్నించారు.తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేద్దామని ప్రజలే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారన్నారు.తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూసి నేర్చుకుని మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి మంత్రి సూచించారు.నిందలు వేయడంతో పాటు మతతత్వ పార్టీని నిరోధిస్తున్న పార్టీ బీజేపీ అని,అబద్ధాల కాంగ్రెస్ కు అభివృద్ధి సాధించిన బీఆర్ఎస్ పార్టీ విజయాలకు పోటీ అన్నారు.2009లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటైనా అమలు చేసిందా..? చర్చకు నేను సిద్ధమని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన మంత్రి హరీశ్ రావు.ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసిన కేసీఆర్ మూడోసారి సీఎంగా హైట్రిక్ కొట్టడం ఖాయం. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ హైట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.

Oplus_131072
Oplus_131072
Pitla Swamy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *