బిఆర్ఎస్ కు తుమ్మల వర్గీయుల రాజీనామాలు
సెప్టెంబర్ 22
పాలేరు నియోజకవర్గంలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బి.ఆర్.ఎస్. ను వదిలి కాంగ్రెస్ లో చేరారు ఆయన వర్గీయులు శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నాయకులు సాదు రమేష్ రెడ్డి బండి జగదీష్, రవి శాఖమూరి రమేష్, వెన్నుపూసల సీతారాములు వెగినాటి లక్మీనర్సయ్య, వీరయ్య, మాదాసి శ్రీను వంగూరి ఉషా, పంతులు నాయక్ తదితరులు మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తుమ్మల బాటలోనే తాము కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో పార్టీ నాయకులు పలువురు సర్పంచ్ లు మాజీ జడ్పీటీసీలు ఎంపిటిసిలు తదితర నాయకులు ఉన్నారు.
