ఉద్యోగం సాధించిన గ్రామ యువతకు సన్మానం
అక్టోబర్ 08
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం పెద్ద కొడప్గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామానికీ చెందిన కలందర్ లక్ష్మణ్, కుర్లేపు యోగేశ్వర్ లు కానిస్టేబుల్ ఉద్యోగానికి, కుమ్మరి సుజాత బిపిఎం ఉద్యోగానికి ఎంపిక అయ్యారు.
ఈ సందర్భంగా కాస్లాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ప్రజా ప్రతినిధులు సన్మానించారు. తదనంతరం ఎంపీటీసీ సాయిరాం మాట్లాడుతూ గ్రామం నుండి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, గ్రామానికి ఎల్లవేళలా మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శోభ నాగభూషణం, ఎంపీటీసీ సాయిరాం, నాయకులు సాయాగౌడ్, ఆకుల సతీష్, కుర్లెపు హన్మండ్లు, సలీమ్, అనంతరావు దేశాయ్, తదితరులు ఉన్నారు.
