రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు శుక్రవారం కాళోజి నారాయణ రావు, జయంతి సందర్బంగా అయన చిత్ర పటము కు పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు మాట్లాడుతూ నా గొడవ పుస్తకాన్ని రాసి ప్రజల్లో తెలంగాణా ఉద్యమ భావజాలాన్ని నింపారన్నారు అన్యాయాన్ని ఎదురించే వాడే నాకు ఆరాద్యుడు అంటూ ప్రజల్లో స్ఫూర్తి నింపారన్నారు తెలంగాణా రాష్ట్రము కోసం అనేక వ్యాసాలు అయనరాయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం లో మేజర్ గ్రామసర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు, ఉపసర్పంచ్ సింగారపునాగరాజు గౌడ్ ,గ్రామ వార్డు సభ్యులు రెడ్డి మల్ల రాజనర్సు ,ఎగదండీ స్వామి, రాజన్న సిరిసిల్ల జిల్లా మాల మహా నాడు జిల్లాఅధ్యక్షులుదోసలచంద్రం ,నల్ల రాజ్ కుమార్ , మరియు ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.
