చాపాడు మండలం డిసెంబర్16:నేను చనిపోతే మోసే వాళ్లు ఎవరూ లేరని బాధతో స్మశానం దగ్గరే చనిపోయిన తల్లి.
మోసే నలుగురు లేరు అందుకే స్మశానానికి దగ్గరనే పడుకున్నా తల్లి బాధ చూస్తే బాధతో కన్నీళ్లు వస్తున్నాయి. చాపాడు మండలం సోమాపురం పంచాయతీ ఆనందాశ్రమం గ్రామంలొ వడ్ల విజయలక్ష్మి (40) గత రెండున్నర సంవత్సరం గా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు చనిపోయింది.
చుట్టుపక్కల వారు నేస్తం సేవా సంస్థ సభ్యులకు సమాచారం అందించడంతో సభ్యులు కొండారెడ్డి,బాలనాగిరెడ్డి,వెళ్లి విజయలక్ష్మి కి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది..
ఈ అంతిమయాత్రలో, కోగటం కొండారెడ్డి, పిప్పళ్ళ బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు…




