Breaking News

పసుపు బోర్డు ఏర్పాటు

173 Views

ఓట్ల కోసమే గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు:చాడ వెంకటరెడ్డి

కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 03

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ప్రధాని మోడీ గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం కేవలం ఎన్నికల జిమ్మికని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానికి గిరిజనులపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. 2014 సంవత్సరంలో విభజన హామీలు ఇస్తామని ప్రకటించి, ఎన్నికలు దగ్గరపడుతుండంతో గిరిజ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం గిరిజన ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబట్టారు.

పాలమూరు జిల్లాలో కరువును రూపుమాపేందుకు నిర్దేశించిన పాలమూరు – రంగ రెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఎందుకు కల్పించే హామీని ఇవ్వలేదని ప్రశ్నించారు.

కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైందని ప్రశ్నించారు. వెనుకబడ్డ జిల్లాలకు కేంద్రం అందించాల్సిన సహాయం మోడీ ఎందుకు మరిచారని అన్నారు. ప్రజల్ని, రైతాంగాన్ని, గిరిజనులను కేంద్రం విస్మరించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *