రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని నర్మాల గ్రామంలో శుక్రవారం వినాయకుల శోభయాత్ర అంగరంగ వైభవంగా నర్మాల గ్రామ యువకులు నిర్వహించారు. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, గణేష్ శోభాయాత్రను, గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో శోభా యాత్రలో పాల్గొన్నారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనం పూర్తి చేశారు.
